కర్నూలు: రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కభర్ది పేర్కొన్నారు.
రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కభర్ది పేర్కొన్నారు. బుధవారం కర్నూలు, నంద్యాల, కలెక్టర్లు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఆధార్ లేని 125 అనాథ పిల్లల్లో 56 మందికి ఆధార్ కార్డులు జారీ చేయగా, మిగతావారికి త్వరితగతిన ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి దివాకర్, ప్రభుత్వ న్యాయవాది షబుద్దీన్, మెంబర్ శివ సుదర్శన్ పాల్గొన్నారు.