నిజామాబాద్ సౌత్: నగర జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం
నిజామాబాద్ జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఇందులో కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్ వైద్యులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు బీపీ, షుగర్, ఈసీజీ, గుండెకు సంబంధించిన స్కానింగ్ నిర్వహించారు. రోజువారీగా పని ఒత్తిడితో ఇబ్బందుల గురవుతున్న జర్నలిస్టులు ఆరోగ్య శిబిరంలో పాల్గొన్నారు.