ధర్మవరంలో కేతిరెడ్డి ఇంటికి వెళ్లిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి..
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శనివారం ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటికి వెళ్లారు. ప్రకాష్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను కేతిరెడ్డి దంపతులకు ప్రకాష్ రెడ్డి అందజేశారు. కాగా కొద్ది నెలలుగా ప్రకాష్ రెడ్డి కేతిరెడ్డి మధ్య రాజకీయ విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఇరువురు విలేకరుల సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తెలిసిందే. శనివారం ఇద్దరూ కలవడంతో వైకాపా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు..