తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గంలో వెల్లువిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
తాడిపత్రి నియోజకవర్గం లో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి 8:30 వరకు శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా పట్టణంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.