అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా రెడ్డిపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరికీ తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని రెడ్డిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తబడిన ఘటనలో కొర్రపాడు గ్రామానికి చెందిన రాజు మరియు నారాయణస్వామి లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిద్దరిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.