మైదుకూరు: పోలీసుల సోదాల చర్యలపై మైదుకూరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వారు మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాదులోని పత్రిక కార్యాలయంపై సోదాలు, ఎడిటర్‌కి, నెల్లూరు బ్యూరోకి నోటీసులు ఇవ్వడం వంటి చర్యలను ప్రతినిధులు ఖండించారు.