అనంతపురం అర్బన్: మొలకల చెరువు మదనపల్లి సమీపంలో కారు డివైడర్ను ఢీకొని పలువురికి గాయాలు
Anantapur Urban, Anantapur | May 2, 2026
మొలకలచెరువు మదనపల్లి సమీపంలో కారు డివైడర్ను ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన ధర్మవరంకు చెందిన ఆదినారాయణ అనే మహిళను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి శనివారం సాయంత్రం తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా పలువురిని కదిరి ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.