నందికోట్కూరు: ప్రాతకోటకు చెందిన వ్యక్తిని మహిళలు కళ్ళలో కారం చల్లి వేట కొడవలతో నరికి దారుణ హత్య
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన మల్లయ్య హత్యకు గురయ్యారు, ఈయన నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లికి 35 సంవత్సరాల క్రితం వెళ్లి ఆర్ఎంపీ గా పని చేస్తున్నారు, అక్కడ కొందరితో ఉన్న భూ వివాదం కేసు కొల్లాపురం కోర్టులో నడుస్తుంది, శుక్రవారం కోర్టుకు హాజరై నా అతడు పెంట్లవెల్లి క్లినిక్ లో ఉండగా ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి వచ్చి కళ్ళలో కారం చల్లి రోడ్డుపైకి లాక్కెళ్ళారు, తలపై కర్రాలతో దాడి చేసి వేటకుడవలతో నరికి పారిపోయారు