చెన్నంపల్లి వద్ద నిర్మిస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్టులు స్థానికులకు ఉపాధి కల్పించాలి బిజెపి నాయకులు డిమాండ్
నంద్యాల జిల్లా అవుకు మండలం చెన్నంపల్లె సమీపంలో నిర్మిస్తున్న సౌర విద్యుత్ ప్రాజెక్టులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బనగానపల్లె, అవుకు మండలాల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, రవికుమార్ మంగళవారం ఆర్డీఓ నరేంద్రనాధ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ప్రాజెక్ట్ యాజమాన్యం గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని, భూములు కోల్పోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు 10:18 AM t