అసిఫాబాద్: బీసీలను నమ్మించి కాంగ్రెస్ మోసం చేసింది:బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం
42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి..బీసీలను నమ్మించి కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఎద్దేవా చేశారు. శనివారం ASFలో చేపట్టిన బీసీ బంద్ కు మద్దతు తెలుపుతూ మాట్లాడారు..ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయని కాంగ్రెస్.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏవిధంగా ఇస్తోందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ ఇచ్చినట్టు ఇచ్చి..అడ్డుకొని..! బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని వాపోయారు. గతంలో సైతం ఇదే తరహాలో రాజ్యాంగాన్ని మారుస్తారు.