కరీంనగర్: ఎంగిలి పువ్వుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ ఆడుతున్న మహిళపై దాడి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతున్న మహిళపై ఓ వ్యక్తి రాళ్లు వేయడంతో ఆ మహిళకు గాయాలైనట్లు స్థానికులు సోమవారం తెలిపారు. కరీంనగర్ కొత్తపల్లి మండలం శాంతి నగర్ లో బతుకమ్మ ఆడుతున్న మహిళలను మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రాళ్లు వేయడంతో ఆ మహిళకు గాయాలు అయినట్లు తెలిపారు. సదరు వ్యక్తిని రాళ్లు ఎందుకు వేసావని అడిగితే, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.