పెద్దవంగర: పెద్దవంగర మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం: చిన్న వంగర గ్రామం ఎల్బీ తండా పరిసరాల్లోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ పాలకుర్తి నియోజకవర్గ హనుమాoడ్ల యశశ్విని ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోవద్దని,తేమ శాతం ద్వారా పత్తి గిట్టుబాటు ధర నిర్ణయించబడుతుందని,రైతులు తేమశాతం తక్కువ ఉండేలా చూసుకొని మద్దతు ధరను పొందాలని తెలిపారు,రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.