నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి.
బహుజన యువజన అధ్యక్షుడు పునీత్.
అన్నమయ్య జిల్లా. మదనపల్లె మండలం కోళ్ల బైళ్ళు పంచాయతీ కార్యదర్శి మంజుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని. ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని బహుజన యువజన అధ్యక్షుడు పునీత్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి మంజుల పై తక్షణమే సస్పెండ్ వేటు వేయాలని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆమెపై క్రిమినల్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు. కోళ్ల బైళ్ళు బాధితులు పాల్గొన్నారు.