కృత్తివెన్ను: కృత్తివెన్ను సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, చేపల వేటకు వస్తున్న ఆరుగురు మత్స్యకారులు మృతి
కృష్ణాజిల్లా కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మునిపెడలో చేపల పట్టివేతకై అమలాపురం తాళ్లరేవు నుండి సుమారు పది మంది మత్స్యకారులతో వస్తున్న మినీ వ్యాన్ సీతనపల్లి వద్ద ట్రాక్టర్ ని ఓవర్ టేక్ చేయబోయి కంటైనర్ ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ లో ఉన్న ఐదుగురు, కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు.