ఆళ్లగడ్డ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, ఐ సీఐ యుగంధర్
ఆళ్లగడ్డ పట్టణ శివారులోని పి చింతకుంట సమీపంలోని టిట్కో గృహ సముదాయంలో శనివారం టౌన్ పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు, ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ యుగంధర్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమానాస్పద ఇండ్ల లో విస్తృత సోదాలు చేశారు, సీఐ యుగంధర్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు