నిజామాబాద్ సౌత్: నిరుద్యోగ యువతకు లవర్స్ థాయిలాండ్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడేలా చేస్తున్న ముఠా సభ్యుడు అరెస్ట్:CP సాయి చైతన్య వెల్లడి
నిరుద్యోగ యువతకు లవోస్ థాయిలాండ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారిచే సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న ముఠా సభ్యుడిని అరెస్టు చేసినట్లు సిపి సాయి చైతన్య ఆదివారం తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పార్టీకి చెందిన పలువురు బాధితులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టమన్నారు. సుచిత్ర, జీడిమెట్ల ప్రాంతానికి చెందిన కోలనాటి నాగ శివ నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి లావోస్ థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ వారి పాస్పోర్ట్ తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేశారు. దీంతో ముఠా సభ్యుడైన నాగ శివ ను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.