రాజేంద్రనగర్: మహేశ్వరం మండల పరిధిలో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి
మహేశ్వరం మం. పరిధిలో విషాదం చోటుచేసుకుంది. 10వ తరగతి విద్యార్థి ఎస్. అంకిత్ (15) చెరువులో ఈతకు వెళ్లి మునిగి మృతి చెందాడు. కేసి తండా వద్ద స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన అంకిత్ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు జరిపి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ సంఘటనతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు