నిజామాబాద్ సౌత్: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఐదో టౌన్ ఎస్ఐ గంగాధర్ తెలిపారు. ఇటీవల న్యాల్కల్ రోడ్డులో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి వయసు 60 నుంచి 65 సంవత్సరాల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఎవరైనా గుర్తు పడితే 5వ టౌన్‌ను సంప్రదించాలన్నారు.