ఒంగోలు అర్బన్: నిరుపయోగంగా ఉన్న కార్పోరేషన్ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 13, 2026
ఒంగోలు నగర కార్పోరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా నిర్వహించడంతో పాటు పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు కార్పోరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలను ఆకస్మికంగా సందర్శించి పారిశుధ్య నిర్వహణను అలాగే నిరుపయోగంగా ఉన్న కార్పోరేషన్ స్థలాలను పరిశీలించారు. స్థలాల నిర్వహణ మరియు మున్సిపాలిటీ తరఫున జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలన చేశారు