కుప్పం మండలంలోని కంగుందిలో రూ.17 లక్షలతో CC రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నంలు బుధవారం ప్రారంభించారు. కంగుంది ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో గ్రామంలో దాదాపు అన్ని వీధుల్లో సీసీ రోడ్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు.