కోటిపల్లి గోదావరి వద్ద ఇద్దరు యువకులు గల్లంతయిన ఘటనలో 2వ మృతదేహం లభ్యం
దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా కోటిపల్లి గౌతమి గోదావరి వద్ద ఆదివారం ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వారిలో ఒక యువకుడి మృతదేహం సోమవారం ఉదయం లభ్యం కాగా, రెండవ యువకుడు యోగమూర్తి మృతదేహం కూడా లభ్యమైనట్లు స్థానికులు తెలియజేశారు.