జహీరాబాద్: స్కూల్ విద్యార్థులను కాపాడిన బస్సు డ్రైవర్ కు ఘనంగా సత్కారం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో స్కూలు బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించి విద్యార్థులను కాపాడిన డ్రైవర్ ను పాఠశాల యాజమాన్యం సత్కరించింది. పట్టణంలోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండీ నిధిన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బస్సు డ్రైవర్ దత్తును శాలువాతో సన్మానించి నగదు బహుమతి అందజేశారు. డ్రైవింగ్ తోపాటు విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు బస్సులో మంటలు చెల్లరేగుతున్న ధైర్యంతో మంటలు అదుపు చేశారని గుర్తు చేశారు. ప్రమాదం నుంచి 36 మంది చిన్నారులను కాపాడడం స్ఫూర్తిదాయకమని ఉపాధ్యాయులు సిబ్బంది అభినందించారు.