నందికోట్కూరు: మాసాపేట ఐటిసి పొగాకు కంపెనీపై వచ్చిన ఆరోపణలు నమ్మొద్దు: కన్నమడకల రైతులు
ఐటీసీ కంపెనీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని రైతులు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని మాసపేట గ్రామంలో ఉన్న ఐటీసీ పొగాకు కంపెనీ ఎదుట ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామానికి చెందిన రైతులు బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కన్నమడకల మాజీ సర్పంచ్ పిక్కలి వెంకటేశ్వర్లు,రైతులు కల్లాల బాలకృష్ణ,పింజరి పెద్ద స్వామి మాట్లాడుతూ ఇతర కంపెనీకి చెందిన రైతులు గత మూడు రోజుల క్రితం ఇక్కడ ఐటీసీ కంపెనీ పొగాకు పంటకు ధర కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేశారని మాకు ఈ కంపెనీ పొగాకు పంటకు మంచిధర కల్పిస్తూ కంపెనీ మాకు అండగా నిలుస్తుందని అన్నారు.వారు చెప్పే మాటలను రైతులు ఎవరూ కూ