గుంతకల్లు: తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ.ప్రభాకర్ రెడ్డిపై చర్యలు, గుత్తిలో విలేకరుల సమావేశంలో ఎస్పీ జగదీష్
తాడిపత్రిలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా తాడిపత్రి ఏఎస్పి రోహిత్ చౌదరి పై మున్సిపల్ చైర్మన్ జేసీ.ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చట్టపరంగా చర్య తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన్ లో జిల్లా ఎస్పీ జగదీష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. గుత్తిలో పోలీస్ శాఖకు సంబంధించిన స్థలాలను వాణిజ్యపరంగా వినియోగించుకుంటామన్నారు.