పుంగనూరు: కుటుంబ కలహాలతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యయత్నం.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం మేలుం దొడ్డి గ్రామంలో కాపురముంటున్న బాబు కుమారుడు. కిరణ్ కుమార్ 25 సంవత్సరాలు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు 108కు సమాచారం తెలిపి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కిరణ్ కుమార్ ,ను హుటాహుటిన పుంగనూరు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. కిరణ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి సిఫారిసు చేశారు, ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలు తెలియాల్సి ఉంది.