ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారు దుకాణదారులు భద్రత విషయంలో తీసుకోవలసిన చర్యలను మీడియాకు తెలిపిన ఎస్పి హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 13, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బంగారు దుకాణదారులు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాకు ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేస్తూ బంగారు దుకాణంలో పనులు చేసే వర్కర్ల పూర్తి వివరాల జాబితాను దుకాణ యజమానులు సేకరించి భద్రపరచాలని తెలిపారు. సమర్థతతో పనిచేసే సెక్యూరిటీ గార్డ్లను దుకాణాల వద్ద భద్రతకు పెట్టుకోవాలన్నారు. అలానే అలారం సిస్టం కూడా బాగా పనిచేసే విధంగా చూసుకోవాలన్నారు. చోరీలు అరికట్టేందుకు నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణ వాటి పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు.