అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని ఎమ్మెల్యే సురేంద్రబాబు సోమవారం పరామర్శించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హనుమంతరాయ చౌదరిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.