ఒంగోలు అర్బన్: క్రికెట్ బెట్టింగ్ ఆడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు యువతకు హెచ్చరిక, నిరంతరం నిఘా ఉంటుందన్న ఎస్పీ
Ongole Urban, Prakasam | Apr 12, 2026
క్రికెట్ బెట్టింగ్ ఆడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు యువతకు విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్ బెట్టింగ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించామని క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొనే వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నుంచి వారిని మందలిస్తున్నట్టు తెలిపారు. బెట్టింగ్ నిర్వహించే వారిపై నిరంతరం ఉంటుందని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.