ఆళ్లగడ్డ: రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఆళ్లగడ్డ క్రీడాకారులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కర్నూలు లో జరిగిన ఉమ్మడి జిల్లా అథ్లెటిక్ ఎంపికలో ఆళ్లగడ్డ ప్రభుత్వ హై స్కూల్ విద్యార్థులు వివేకా నంద అండర్ 20 జావెలిన్ త్రో లో స్వర్ణం, డి కార్తీక్ నాయక్ అండర్ 16 లో రజితం పతకాలు సాధించారు, ఆగస్టు 10 12 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారు, హెచ్ఎం వీరరాఘవయ్య, కోచ్ సుబ్బారాయుడు వీరిని సోమవారం అభినందించారు