అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి మండల నుంచి వచ్చిన అధికారులు టిడిపి నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని అదేవిధంగా బుడ్డప్ప నగర్ లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా దర్బారు నిర్వహించబోతున్నామని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనే సమస్యలు అర్జీ రూపంలో ఇవ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు.