డోన్: డోన్ లో ఆగని దొంగతనాలు, రాత్రి దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు యువకులు,సీసీ కెమెరాలు రికార్డ్
Dhone, Nandyal | Apr 7, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి దొంగతనాలు ఆగడం లేదు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన దొంగలు వాటిని లెక్కచేయడం లేదు సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని దుకాణాల దగ్గర ఇద్దరు యువకులు దొంగతనానికి ప్రయత్నించారు ఈ విషయం అక్కడే ఉన్న సిసి కెమెరాలలో రికార్డు అయింది.. అయితే సీసీ కెమెరాలు లేని దుకాణాల్లో కొంత నగదు పోయినట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం