తుంగతుర్తి: తుంగతుర్తిలో యూరియా సరఫరాలో జాప్యంపై ఆగ్రహించిన రైతులు
యూరియా సరఫరాలో జాప్యంపై ఆగ్రహించిన రైతులు శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.