అక్కంపల్లిలో నయనాలప్ప స్వామి తిరునాల, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
సంజామల మండలం అక్కంపల్లె గ్రామ సమీపంలో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన నయనాలప్ప క్షేత్రంలో కార్తీకమాసం చివరిదైన నాల్గవ సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తెల్లవారు జామున నుంచి పూజలు అభిషేకాలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.