మద్నూర్: లెండి వాగులో భారీగా వరద, గోజేగావ్ కు నిలిచిన రాకపోకలు
లెండి వాగులో భారీగా వరద, గోజేగావ్ కు నిలిచిన రాకపోకలు.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగావ్ వద్ద వంతెనపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లెండి వాగులో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. వాగుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాకపోకలు నిలిపివేసినట్లు తహశీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు. వాగు ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకూడదని తహశీల్దార్ సూచించారు.