నిజామాబాద్ సౌత్: పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలి: AISF జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను వెంటనే విడుదల చేయాలని AISF జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, PG, డిగ్రీ, Bed, MBA విద్యాసంస్థల బంద్ కు AISF సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. AISF జిల్లా సమితి అధ్వర్యంలో నగరంలో NTR చౌరస్తా లో పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని దర్న నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AISF నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి 8000 వేల కోట్ల రూపాయల ఫీజురియంబర్స్మెంట్,స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితంతో చలగాటం ఆడుతున్నారన్నారు.