యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి పోటెత్తి, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ పరిసర ప్రాంతాలు
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి శనివారం ఉదయం నుండి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని ఇష్ట దైవాలను భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామివారి సాధారణ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు శనివారం మధ్యాహ్నం తెలిపారు.