నంద్యాల అర్బన్: గోస్పాడు మండలంలో బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి జైలు శిక్ష
Nandyal Urban, Nandyal | Jul 13, 2026
నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాల గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అశ్లీల పాటలు పాడి, బూతులు తిడుతూ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బంది కలిగించిన కానాల నగేష్పై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం అతడిని ఆళ్లగడ్డ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రవికుమార్ ఎదుట హాజరుపరచగా.. రూ.500 జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష విధించారు