అన్నమయ్య జిల్లాలో నేరాలను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ శనివారం రౌడీషీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లలో ఈ కార్యక్రమం చేపట్టారు.నేరాలకు దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.