పింఛా ప్రాజెక్టు నుంచి రోజువారీగా నీటి విడుదల వివరాలు వెల్లడించిన అధికారులు
టి.సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టులో నీటి మట్టం 999.30 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 0.31409 టీఎంసీలు (లేదా 314.09 ఎంసిఎఫ్టీ) నీరు నిల్వగా ఉందని ఏఈఈ బి. నాగేంద్ర నాయక్ తెలిపారు.ప్రాజెక్టుకు 987 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, 944 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో జరుగుతోందన్నారు. ప్లడ్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోందని ఆయన చెప్పారు.గేటు-1 ద్వారా 315 క్యూసెక్కులు (0.25 అడుగులు ఓపెన్) మరియు గేటు-3 ద్వారా 629 క్యూసెక్కులు (0.50 అడుగులు ఓపెన్) నీరు విడుదల అవుతోందని వివరించారు.