బనగానపల్లె: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేట గ్రామ శివారులో మొక్కజొన్న వరి పంటలను రైతులతో కలిసి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బుధవారం పరిశీలించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కాటసాని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు రోడ్లిక్కారని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కాటసాని వెంట నియోజకవర్గ వైసిపి నాయకులు పాల్గొన్నారు