ఒంగోలు అర్బన్: బాలల హక్కుల పరిరక్షణ పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన అధికార యంత్రాంగం
Ongole Urban, Prakasam | Jun 23, 2026
బాలల హక్కుల పరిరక్షణలో అధికారులంతా పూర్తి భాధ్యత వహించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మెన్ వేటుకూరి ఏవియస్ సూర్య నారాయణ రాజు మరియు సభ్యుడు ఉండవల్లి గాంధీ బాబు తెలియజేశారు. ప్రకాశం జిల్లా జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ,బాలల సంరక్షణ విభాగాలు,కార్మిక శాఖ,విద్యా శాఖ,పోలీసు శాఖ,వైద్య ఆరోగ్య శాఖ,గ్రామీణ అభివృద్ధి శాఖ,బి.సి.వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు,బాలలతో కలసి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు