కనిగిరి: పెద చెర్లోపల్లి మండలం లింగన్నపాలెంలో MSME పార్కును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదచెర్లోపల్లి మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన MSME పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఇక్కడనుండే రాష్ట్రంలోని మరో 50 MSME పార్కులను వర్చువల్ గా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. కనిగిరి లాంటి వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు స్థాపించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అధికారులు పాల్గొన్నారు.