ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికుల నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు సుమారు 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వెంటనే మంజూరు చేయాలని కోరారు. స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాల ఇవ్వాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని సబ్బులు నూనె బూట్లు ఇవ్వాలన్నారు. అనంతరం ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. సిఐటియు మండల కన్వీనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.