కర్నూలు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప అభివృద్ధి లేదు: వైకాపా యువజన విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ యువజన విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్ లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. కేంద్రం అనుమతులతో మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.