కదిరి: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన అసోసియేషన్ సభ్యులు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి లో అగ్రిగోల్డ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను శనివారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు హాజీ అత్తర్ మహబూబ్ బాషా వినతి పత్రం అందజేసి కోరారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను సీఎం లిస్ట్ కి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరారు.