గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ ఎదుట సాష్టాంగ నమస్కారంతో ఏఐవైఎఫ్ నేతలు, విద్యార్థులు నిరసన
Guntur, Guntur | Sep 23, 2025 కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. పలు విద్యా రంగ సమస్యల పరిష్కారానికై మంగళవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఏఐవైఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.