కొత్తపట్నం మండలం ఆలూరు సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని అధికారులను డిమాండ్ చేసిన వైసిపి నాయకులు
Ongole Urban, Prakasam | Jun 1, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరు సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వెంటనే వాటిని అడ్డుకోవాలని వైసిపి నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నాయకులు మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు అక్రమమట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.