అనారోగ్యంతో సతమతమవుతున్న వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తలారి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.