ఖైరతాబాద్: సోమాజిగూడ లో గ్రూప్ వన్ ర్యాంకర్ల తల్లిదండ్రులు సమావేశం
సోమాజిగూడ ప్రెసైక్లబ్లో గ్రూప్-1 ర్యాంకర్లు, తల్లిదండ్రులు సమావేశాన్ని నిర్వహించారు. పిల్లల భవిష్యత్తుపై రాజకీయాలు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. గ్రూప్-1 పై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, ఒక్కో పేరెంట్ రూ.3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. కష్టపడి, అప్పులు చేసి పిల్లలను చదివించామని ఆవేదన వ్యక్తం చేశారు.