డోన్: డోన్ లో ఆటోను తాడుతో లాగుతూ నిరసన తెలిపిన సిపిఎం నాయకులు
Dhone, Nandyal | May 16, 2026 పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డోన్లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆటోను తాడుతో లాగుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు. ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు అధికమై నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.